happy new year 2018 songs,download,wallpapers,images,sms,quotes,videos,offers happy merry christmas songs,download,wallpapers,images,sms,quotes,videos,offers http://HAPPYNEWYEAROFFERS.COM/

Tuesday, 2 April 2019

జూ. ఎన్టీఆర్ రాజకీయాలపై ఆయన మామ నార్నే ఇంట్రస్టింగ్ కామెంట్స్

జూ. ఎన్టీఆర్ రాజకీయాలపై ఆయన మామ నార్నే ఇంట్రస్టింగ్ కామెంట్స్



జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి అభిమానుల ఆశాకిరణం.. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మూడో తరంలోనూ కొనసాగిస్తున్న ఒకే ఒక్కడు. నందమూరి తారకరత్న, కల్యాణ్ రామ్ వంటి వారు ప్రయత్నిస్తున్నా వారు జూనియర్ కు ఏమాత్రం సాటి రారన్న సంగతి తెలిసిందే.


అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసుడు అని కూడా బలంగా నమ్మేవారు ఉన్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున 2009 ఎన్నికల సమయంలో ప్రచారం కూడా నిర్వహించారు. ప్రస్తుతం మాత్రం జూనియర్ రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఇటీవల వైసీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. మరి మీరు వైసీపీలోకి వెళ్తే రేపు జూనియర్ ఎన్టీఆర్ కు ఇబ్బంది కాదా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. నార్నే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్న పిల్లోడు.. ఆయనకూ రాజకీయాలకూ ఏం సంబంధం లేదన్నారు ఆయన మామ నార్నే శ్రీనివాసరావు.



జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలు తెలియవని నార్నే అన్నారు. ప్రస్తుతం అతని సినిమాలేవో అతను చేసుకుంటున్నాడు.. తన ఫ్యామిలీతో సుఖంగా ఉన్నాడు.. ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. ఆయనకూ రాజకీయాలకూ సంబంధం లేదు అంటూ మాట్లాడారు ఆయన మామ నార్నే శ్రీనివసరావు.
Share:

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Content Policy DMCA

Privacy Policy

Copyright © Happy New Year 2018 Offers | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com