happy new year 2018 songs,download,wallpapers,images,sms,quotes,videos,offers happy merry christmas songs,download,wallpapers,images,sms,quotes,videos,offers http://HAPPYNEWYEAROFFERS.COM/

Tuesday, 2 April 2019

జాతీయ మీడియా ప్రకారం బాడ్ టైమే! అను'కుల" మీడియాతో నెట్టుకొస్తున్న చంద్రబాబు!

జాతీయ మీడియా ప్రకారం బాడ్ టైమే! అను'కుల" మీడియాతో నెట్టుకొస్తున్న చంద్రబాబు!



ఒకవైపు కులమీడియా చంద్రబాబు నాయుడుకు జాకీలువేసి పైకిలేపుతూనే ఉంది. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏం సాధించాడో చెప్పలేక పోతున్నారు. కేసీఆర్-జగన్-మోడీ  అంటూ ఈత్రయాన్ని ఒక గాటన కట్టి, ముఖ్యంగా వైఎస్ జగన్మోహనరెడ్డి మీద అడ్డమైన బురద చిమ్ముతూ తెలుగుదేశం పార్టీని కాపాడు కోవాల ని కుల మీడియా ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.


తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడమే ధ్యేయంగా బరితెగించి వ్యవహరిస్తూ ఉంది ఆ పార్టీ అనుకూలకుల మీడియా. మరో రెండు వారాల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యం లో, టీడీపీ అనుకూల మీడియా ఇంకా ఎలాంటి వేషాలు వేస్తుందో చూడాల్సి ఉంది. ఏ స్థాయికి దిగజారిందంటే "లోక్ నీతి - సీఎస్డీఎస్" ఉత్తర భారత మీడియా చేసిన సర్వే తో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయ దుంధుబులు మ్రోగిస్తూ అధికారంలోకి వస్తుందంటూ రాసింది.

జాతీయ మీడియా ప్రకారం బాడ్ టైమే! అను'కుల" మీడియాతో నెట్టుకొస్తున్న చంద్రబాబు!


నిజానికి అలాంటి సర్వే ఎప్పుడు జరగలేదని అ మీడియా ప్రకటన వెలువరించటమే కాదు ఈ వార్త ప్రచురించిన తెలుగు దేశం పార్టీ అనుకూల కులపత్రిక, కరపత్రంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తానని ప్రకటించింది.  ఆ సంగతలా ఉంటే, జాతీయ మీడియా మాత్రం నారా చంద్రబాబు నాయుడి కథ ముగిసిపోయిందని అంటుంది.

జాతీయ మీడియా ప్రకారం బాడ్ టైమే! అను'కుల" మీడియాతో నెట్టుకొస్తున్న చంద్రబాబు!

చంద్రబాబు రాజకీయంగా ముందుకు సాగడానికి ఇక దారులు ఏవీలేవని అన్నీ దారులు మూసుకు పోయాయని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి.తాజాగా ప్రఖ్యాత జాతీయ ఇంగ్లిష్ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ అందుకు సంబంధించి కథనాన్ని ఇచ్చింది. ఏపీలో ఉన్న రాజకీయపరిస్థితి గురించి మీడియా విశ్లేషించింది.


చంద్రబాబు రాజకీయంగా అనేక తప్పిదాలు చేశారని, పాలనపరంగా పూర్తిగా వైఫల్యం చెందారని ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని ఎకనామిక్స్ టైమ్స్ విశ్లేషించింది. చంద్రబాబు నాయుడు ఏవో కపట కుటిల వ్యూహాలతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంలో పడి పోయి సినీ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించడం కూడా చంద్రబాబు వ్యూహమే అని ఆ పత్రిక విశ్లేషణ.


ప్రజల్లో పరువు ప్రతిష్ట పరపతి సర్వం కోల్పోయిన టిడిపి పవన్ కల్యాణ్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తాను గెలవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ అభిప్రాయపడింది. అయితే ఆ వ్యూహం ప్రతిఫలించే అవకాశాలు కనిపించడం లేదని ఎకనామిక్ టైమ్స్ పత్రిక విశ్లేషించింది. మొత్తం మీద తాజా రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు కథ అయిపోయిందని, ఈ ఎన్నికల ఫలితాలు - మే ఇరవై మూడు తర్వాత వెల్లడవనున్న దరిమిలా చంద్రబాబు నాయుడుకు ఇక రాజకీయంగా శాశ్విత విశ్రాంతేనని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి!
Share:

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Content Policy DMCA

Privacy Policy

Copyright © Happy New Year 2018 Offers | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com